షవోమీ నుంచి ఎయిర్ ఛార్జర్..

సాంకేతిక రంగం ఏవిధంగా ముందుకెళ్తుందంటే మానవుడు ఎలాంటి శ్రమ లేకుండా ఉన్న చోటే అన్ని జరిగిపోయేలా మార్పులను తీసుకోస్తోంది.

హైదరాబాద్: సాంకేతిక రంగం ఏవిధంగా ముందుకెళ్తుందంటే మానవుడు ఎలాంటి శ్రమ లేకుండా ఉన్న చోటే అన్ని జరిగిపోయేలా మార్పులను తీసుకోస్తోంది. ఈ తరహాలోనే రానున్న కొన్ని రోజుల్లో షవోమీ కంపెనీ.. ఎలాంటి ఛార్జింగ్ పెట్టనవసరం లేకుండా ఫోన్ ఎక్కడ ఉన్నా సరే ఛార్జింగ్ అయ్యే విధంగా ఓ డివైజ్ ను తయారు చేస్తోంది. ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ పేరుతో 144 మైక్రో యాంటెనా వినియోగించి న్యారో వేవ్ బీమ్ విధానంలో విద్యుత్ శక్తి తమ ఫోన్ లో చేరి బ్యాటరీ నిండే విధంగా దీనిని రూపొందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. షవోమీ తెలిపిన వివరాల ప్రకారం... ఒక గదిలో డివైజ్ ని ఉంచితే మనం గదిలో వెళ్లగానే ఫోన్ ఛార్జ్ అవ్వడం మొదలవుతుంది. ఈ డివైజ్ తో ఒకే సారి ఎన్ని ఫోన్లనైనా ఛార్జ్ చేసుకునే వీలుంటుందని పేర్కొంది. మరి ఈ డివైజ్ ఎలా పనిచేస్తుందో తెలిసుకోడానికి అది మార్కెట్లో వచ్చే వరకు ఆగాల్సిందే...

మునుపటి వ్యాసం