మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 60 గంట‌ల పాటు లాక్‌డౌన్‌

కొవిడ్ కేసులు విజృంభిస్తున్ననేపథ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

భోపాల్‌: కొవిడ్ కేసులు విజృంభిస్తున్ననేపథ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ లాక్ డౌన్ ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనే ఉండనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం 6 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌రకు ఈ ఆంక్షలు అమ‌ల్లో ఉండ‌నున్నాయని ఆయన పేర్కొన్నారు. గ‌త 24 గంట‌ల్లోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 4 వేల‌కు పైగా కేసులు న‌మోదు కాగా, రాష్ట్రంలోని పెద్ద న‌గ‌రాలైన ఇండోర్‌, భోపాల్‌ల‌లో వీటి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. 

మునుపటి వ్యాసం