వాటితో గుర్తింపు తెచ్చుకుంది.. ఆపై వాటిని కత్తిరించింది

తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకున్న ఓ మహిళ పొడవాటి గోర్లు పెంచుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

హైదరాబాద్: తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకున్న ఓ మహిళ పొడవాటి గోర్లు పెంచుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఇప్పుడు ఆ మహిళే గిన్నిస్ రికార్డుకు కారణమైన తన వేలి గోర్లను కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. యూఎస్‌లోని టెక్సాస్‌కు చెందిన అయానా విలియమ్స్ 1979 నుంచి తను గోర్లు పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే 2017లో ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ గోర్లు తనకు అవసరం లేదనిపిస్తున్నందునే కత్తిరించుకున్నానని అయానా విలియమ్స్ చెప్పింది. ఆమెకు ప్రస్తుతం 733.35 సెంటిమీటర్లు పొడవుగల గోర్లు ఉండేవి. ఇప్పుడు తను వాటిని కోల్పోయినప్పటికీ తాను క్వీన్ అనే చెప్తోంది. కాగా ఈ గోర్లను ఫ్లోరిడాలోని మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.

మునుపటి వ్యాసం