పరిషత్ ఎన్నికలు: రాష్ట్ర వ్యాప్తంగా 47.42 శాతం పోలింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేడు సుమారు 2,44,71,002 మంది గ్రామీణ ప్రజలు ఓటు హక్కు వినియోగిచుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మరికాసెపట్లో అనగా సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 

జిల్లాల వారీగా పోలింగ్:
శ్రీకాకుళం : 46.46 శాతం, విశాఖపట్నం : 55.29 శాతం, విజయనగరం : 56.57 శాతం, ప.గో.జిల్లా : 55.4 శాతం, గుంటూరు : 37.65 శాతం, తూ.గో. జిల్లా : 51.64 శాతం, అనంతపురం : 45.70 శాతం, చిత్తూరు : 50.39 శాతం, వైఎస్ ఆర్ : 43.77 శాతం, కృష్ణ : 49 శాతం, ప్రకాశం : 34.19 శాతం, కర్నూలు : 48.40 శాతం, నెల్లూరు : 41.8 శాతం గా ఉంది. 

మునుపటి వ్యాసం