ప్రతి గ్రామానికి ఇంటర్నెట్: కేటీఆర్

రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ అందించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ అందించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఈ భేటీలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఐటీ, ఆర్థిక, మిషన్‌ భగీరథ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...టీ-ఫైబర్‌ పరిధిని నగరాలకు విస్తరించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీనీ ఈ ఆగస్టు నాటికే పూర్తి చేయాలని సూచించారు. జూన్‌ నుంచి 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్‌ కనెక్షన్‌ అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇందులో భాగంగానే ప్రయోగాత్మకంగా ఇప్పటికే 5 రైతు వేదికలను టీ-ఫైబర్‌తో అనుసంధానించినట్లు చెప్పారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తయిన గ్రామాల్లో టీ-ఫైబర్‌ పనులు కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. 

మునుపటి వ్యాసం