వైరస్ కట్టడికి అప్రమత్తతే శ్రీరామ రక్ష

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు సుమారు లక్షకపైగా కొవిడ్-19 పాటిజివ్ కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు పలు చర్యలు తీసుకుంటోంది. దేశంలో వ్యాపిస్తున్న రెండో దశ వైరస్ లో బ్రెజిల్‌, యూకే కు చెందిన స్ట్రెయిన్లు కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వైరస్ సోకిన వారు గతంలో జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది లాంటి లక్షణాలు అధికంగా ఉండేవి. కానీ ప్రస్తుతం 80% రోగుల్లో ఎలాంటి లక్షణాలు లేకపోవటంతో పాటు జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం, నీరసం, కీళ్లనొప్పులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పలువురు అంటున్నారు. ఈ లక్షణాలతో ఎవరైనా బాధపడుతుంటే ఆలస్యం చేయకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వైరస్ బారిన పడ్డ కొందరిలో గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిన్నట్టు గుర్తించారు.

మునుపటి వ్యాసం