నియామకాలు చేపట్టి... నిరుద్యోగులను ఆదుకోవాలి: వేణుగోపాల్ గౌడ్

నియామకాలు చేపట్టి... నిరుద్యోగులను ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్ల కొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు.

వరంగల్: నియామకాలు చేపట్టి... నిరుద్యోగులను ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్ల కొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్డీఎల్సీఈ సెంటర్ వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి, నిరుద్యోగ అమరుల ఆశయ దీక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ మేరకు నిరుద్యోగుల ఆశయ సాధనకు దీక్షకు కూర్చున్న విద్యార్థి నాయకులను పూల మాల వేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడ విడుదల చేయలేదని అన్నారు. నియామకాలు లేక విద్యార్థులు మనోవేదనకు గురై ప్రాణత్యాగం చేసుకుంటున్నారన్నారు. కొన్ని రోజుల క్రితం విశ్వవిద్యాలయ విద్యార్థి బోడ సునిల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఆయన గుర్తుచేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకులను ఆదుకోవాలని కోరారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామిని నిలబెట్టుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కేయూ జేఏసీ నాయకులు ఇట్టబోయిన తిరుపతి యాదవ్, మేడ రంజిత్, రాజేందర్, రాజు నాయక్, కార్తిక్, మాడిశెట్టి నాగరాజుపటేల్ తదితరులు పాల్గొన్నారు. 

 

మునుపటి వ్యాసం