నీట్-పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలు వాయిదా

నీట్-పీజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్) ఎగ్జామ్‌ను మెడికల్ ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.

న్యూదిల్లీ: నీట్-పీజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్) ఎగ్జామ్‌ను మెడికల్ ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 18న జరగవలసిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గురువారం ట్వీటర్ వేదికగా ప్రకటించారు. కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ, వివిధ రాష్ట్రాల విద్యా శాఖలు కొన్ని పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

మునుపటి వ్యాసం