తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుద‌ల

తెలంగాణ ఎడ్‌సెట్‌-2021 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 19 నుంచి జూన్ 15 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ స్వీకరణ జరుగగా ఆగ‌స్టు 24, 25 తేదీల్లో ప‌రీక్ష నిర్వ‌హించనున్నారు.

ఆగ‌స్టు 24,25 తేదీల్లో పరీక్ష
హైద‌రాబాద్: తెలంగాణ ఎడ్‌సెట్‌-2021 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 19 నుంచి జూన్ 15 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ స్వీకరణ జరుగగా ఆగ‌స్టు 24, 25 తేదీల్లో ప‌రీక్ష నిర్వ‌హించనున్నారు. అయితే ఈ ఏడాది అన్ని మెథ‌డాల‌జీల‌కు ఒకే ప్ర‌శ్నప‌త్రం ఉంటుంద‌ని ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెసర్‌ రామకృష్ణ వెల్ల‌డించారు. బీఈడీ కోర్సులో పలు మార్పులు చేస్తూ విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ చిత్రారామచంద్రన్‌ సోమవారం జీవో-14 జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ వారితో పాటు బీబీఏ, బీబీఎం, బీసీఏ విద్యార్థులు కూడా బీఈడీ కోర్సుల్లో చేరవచ్చని జీవోలో పేర్కొన్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో సిల‌బ‌స్‌, న‌మూనా ప్ర‌శ్నాప‌త్రం అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు.

 

మునుపటి వ్యాసం