ప్రముఖ హాస్యనటుడు వివేక్ కు గుండెపోటు.. పరిస్థితి విషమం

ప్రముఖ హాస్య నటుడు వివేక్ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుప‌త్రిలో చేరారు.

చెన్నై: ప్రముఖ హాస్య నటుడు వివేక్ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుప‌త్రిలో చేరారు. ఆయన ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని కొన్ని గంటల్లో గడిస్తే తప్ప ఆయన పరిస్థితిపై ఎలాంటి విషయం వెల్లడించలేమని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం వివేక్‌ను ప్ర‌త్యేక వైద్య బృందం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తోందన్నారు. 

తమిళ సినీ పరిశ్రమలో హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ దాదాపు తెలుగు, తమిళం, కన్నాడ, బాలీవుడ్ తదితర భాషల్లో 220 సినిమాలు చేశాడు. ఆయన సనీ పరిశ్రమకు చేసిన కృషికి గాను ప్రభుత్వం 2009లో ప‌ద్మ‌శ్రీ పురస్కారంతో సత్కరించింది. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్, విశాల్ వంటి స్టార్ హీరోల‌తో ఆయన కలిసి పనిచేశారు. గురువారం నాడు కరోనా టీకా తీసుకున్న ఆయన ప్ర‌జ‌ల‌కు వైరస్ రాకుండా ఉండేందుకు అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు. 

మునుపటి వ్యాసం