నగర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ‌మేయ‌ర్

కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ప్ర‌జలంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి సూచించారు.

హైద‌రాబాద్: కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ప్ర‌జలంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి సూచించారు. నిమ్స్‌ ఆసుపత్రిలో రెండో డోసును శుక్రవారం మేయర్ విజయలక్ష్మీ తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. టీకా సామర్థ్యం విషయంలో అపోహలు నమ్మోద్దని అన్నారు. 45 ఏళ్లు దాటిన వారంద‌రూ టీకా తీసుకోవాల‌ని సూచించారు.