ఇగ్నోలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) సర్టిఫికేట్, సెమిస్టర్ ఆధారిత ప్రొగ్రామ్స్‌ మినహా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.

దిల్లీ: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) సర్టిఫికేట్, సెమిస్టర్ ఆధారిత ప్రొగ్రామ్స్‌ మినహా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. జ‌న‌వ‌రి 2021 సెష‌న్‌కు ఇగ్నో మొత్తం 16 కోర్సులను ఆన్‌లైన్ విధానం ద్వారా ఆఫ‌ర్ చేసింది. ఇగ్నో వెబ్‌సైట్‌లోని ప్రొగ్రామ్ విభాగంలో కోర్సుల వివ‌రాలు అందుబాటులో ఉన్నాయి. అభ్య‌ర్థులు ignouiop.samarth.edu.in.ను సంద‌ర్శించి త‌మ ద‌ర‌ఖాస్తు ఫారాల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చని ఇగ్నో వెల్లడించింది.

 

మునుపటి వ్యాసం