మొబైల్ రీచార్జ్ కోసం వృద్ధురాలి హత్య

మొబైల్ రీచార్జ్ కు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌నే నెపంతో అమ్మమ్మనే హతమార్చిన ఘటన ‌ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ల‌క్నో: మొబైల్ రీచార్జ్ కు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌నే నెపంతో అమ్మమ్మనే హతమార్చిన ఘటన ‌ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అలీగ‌ఢ్ కు స‌మీపంలోని ప‌ద్రా గ్రామంలో రీఛార్జ్ చేసుకునేందుకు డబ్బులు ఇవ్వడానికి అమ్మమ్మ నిరాకరించటంతో ఈ నెల 2న ఓ బాలుడు హ‌త్య‌చేశాడు. బాలుడు స్నేహితుల‌తో క‌లిసి ఊపిరి ఆడ‌కుండా చేయ‌డంతో బాధితురాలు మ‌ర‌ణించింది. గుండెపోటుతో ఆమె మ‌ర‌ణించింద‌ని భావించిన కుటుంబ‌స‌భ్యులు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఆపై అనుమానంతో బాలుడిని నిల‌దీయ‌గా నేరం అంగీక‌రించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడిని వారి స్నేహితులను అరెస్ట్ చేశారు. 

మునుపటి వ్యాసం