కార్పొరేషన్ ఎన్నికల్లో గౌడన్నలకు సముచిత స్థానం కల్పించాలి: మార్కరవి గౌడ్

గ్రేటర్ వరంగల్ పుర ఎన్నికల్లో గౌడన్నలకు సముచిత స్థానం కల్పించాలని జై గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు మార్కరవి గౌడ్ అన్నారు.

వరంగల్: గ్రేటర్ వరంగల్ పుర ఎన్నికల్లో గౌడన్నలకు సముచిత స్థానం కల్పించాలని జై గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు మార్కరవి గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో విద్యార్థి విభాగం అధ్యక్షుడు చిర్ర సుమన్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'గతంలో జరిగిన ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడం బాధాకరమని తెలిపారు. జనాభా లెక్కల ప్రకారం గౌడ్ లకు కార్పొరేటర్ టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు'. కార్యక్రమంలో జై గౌడ్ కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు కొయ్యడ అంజయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు బుర్ర వెంకట నర్సయ్య గౌడ్, చిర్ర రాజేందర్ గౌడ్, రూరల్ జిల్లా అధ్యక్షులు గిరి కత్తుల సాయిబాబా గౌడ్, హసన్ పర్తి మండల అధ్యక్షుడు చిర్ర రాజేష్ గౌడ్, జై గౌడ జిల్లా నాయకులు రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.