ఉదారత చాటుకున్న సాఫ్ట్‌పాత్... విద్యార్థినికి రూ. లక్ష సాయం

సాఫ్ట్‌పాత్ సిస్టమ్ వ్యవస్థాపకులు రవిచందర్, సుషుమ్న రాయ్ తమ ఉదారతను చాటుకున్నారు.

హైదరాబాద్: సాఫ్ట్‌పాత్ సిస్టమ్ వ్యవస్థాపకులు రవిచందర్, సుషుమ్న రాయ్ తమ ఉదారతను చాటుకున్నారు. నారాయణ పేట జిల్లా, మక్తల్ మండలం, కర్ని గ్రామానికి చెందిన మజ్జిగ పల్లవికి ఉన్నత చదువుల కోసం రూ.లక్ష సాయం అందించారు. ఈ సందర్భంగా సాఫ్ట్‌పాత్ సిస్టమ్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ హెచ్ఆర్ సుబ్బారావు చివుకుల మాట్లాడుతూ... ఏఎన్ఎం గా పనిచేస్తూ.. కుమార్తె మజ్జిగ పల్లవిని ఖజకిస్థాన్ లో ఉన్నత చదువులు చదివిస్తున్న ఆండాలమ్మను ప్రశంసించారు. పల్లవి ఎంబీబీఎస్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో విధంగా మార్పులు వచ్చాయన్నారు. మజ్జిగ పల్లవి మాట్లాడుతూ... సాఫ్ట్‌పాత్ సంస్థ వ్యవస్థాపకులు రవిచందర్, సుషుమ్న రాయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.