పోయిన వాహనాలు ఇందులో ఉన్నాయేమో చెక్ చేసుకోండి: కమిషనర్

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వివిధ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో దాదాపు 706 వాహనాలు దొరికాయి.

హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వివిధ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో దాదాపు 706 వాహనాలు దొరికాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఉన్నాయి. వీటి యజమానులు ఎవరైనా ఉంటే వెంటనే అంబర్‌పేటలోని రాచకొండ కార్‌ హెడ్‌క్వార్టర్స్‌లో 15 రోజుల్లో సంప్రదించాలని పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సూచించారు. వాహనానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని, లేకుంటే బహిరంగ వేలంలో విక్రయిస్తామని పేర్కొన్నారు. వాహనాల వివరాలను www//:rachakondapolice.in.telangana.gov.in సైట్‌లో పొందుపరిచామన్నారు.