కరోనాతో వసతి గృహ వార్డెన్ మృతి

జిల్లాలోని అమ్రాబాద్‌ గిరిజన బాలుర వసతి గృహంలో వార్డెన్‌గా పనిచేస్తున్న ఆనంద్ కుమార్(30) కరోనా బారినపడి శుక్రవారం తుదిశ్వాస విడిచాడు.

నాగర్‌కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్‌ గిరిజన బాలుర వసతి గృహంలో వార్డెన్‌గా పనిచేస్తున్న ఆనంద్ కుమార్(30) కరోనా బారినపడి శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. చిన్న వయసులోనే వార్డెన్‌గా పని చేస్తూ ఈ మధ్యకాలంలో మన్ననూర్ గ్రామంలోని గిరిజన అభివృద్ధి శాఖలో ఇన్‌చార్జి ఏటీడీవో గా బాధ్యతలు చేపట్టారు. ఆనంద్‌ కుమార్ మృతిపట్ల గ్రామస్థులు, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం నాయకులు నివాళులు అర్పించారు.

మునుపటి వ్యాసం