ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు.. 20 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,096 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి 2,194 మంది కోలుకోగా, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,48,231కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,05,266 మంది కోలుకోగా, 35,592 యాక్టివ్‌ కేసులున్నాయి. 7,373 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరుతో 1,024 పాజిటీవ్ కేసులు కాగా, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,962 పరీక్షలు నిర్వహించారు. 

మునుపటి వ్యాసం