మసాలా ఓట్స్‌ తయారీ విధానం

స్టౌ మీద కావాల్సిన గిన్నె పెట్టి నూనె పోయాలి. అది వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి.

కావాల్సిన పదార్థాలు:

  • ఓట్స్‌: కప్పు, ఉల్లిపాయ: పావుకప్పు,
  • టమాట ముక్కలు: పావుకప్పు,
  • సన్నగా తరిగిన వెల్లులి: చెంచాడు,
  • ధనియాల పొడి: పావు చెంచా,
  • జీలకర్రపొడి: పావుచెంచా,
  • బీన్స్‌: పావుకప్పు, క్యారెట్‌: పావుకప్పు,
  • నిమ్మరసం: రెండు చెంచాలు,
  • ఉప్పు: తగినంత,
  • నూనె: కొద్దిగా, పసుపు: చిటికెడు.

తయారీ విధానం: స్టౌ మీద కావాల్సిన గిన్నె పెట్టి నూనె పోయాలి. అది వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి, టమాట, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు వేసి కాసేపు వేయించాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి. కొద్దిగా వేగిన తరువాత తగినన్ని నీళ్లుపోసి ఈ ముక్కలను ఉడికించాలి. ఉడికిన తర్వాత ఓట్స్‌ వేయాలి. కొద్దిగా మగ్గించి కొత్తిమీర వేసి, నిమ్మరసం చల్లుకుంటే రుచికరమైన మసాలా ఓట్స్‌ రెడీ అయినట్లే.

 

మునుపటి వ్యాసం