గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మృతి

తాటి చెట్టుపై నుంచి పడి ప్రమాదవశాత్తు మృతి

వరంగల్ అర్బన్ (మే13, 2021): తాటి చెట్టుపై నుంచి పడి ప్రమాదవశాత్తు గీత కార్మికుడు మరణించిన ఘటన జిల్లా పరిధిలోని వేలేరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరి శ్రీనివాస్ గౌడ్ గురువారం సాయంత్రం రోజు దిన చర్యలో భాగంగా కల్లు కోసం చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో వేగంగా గాలులు రావటంతో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ గౌడ్ మృతిపట్ల గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్ తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.'గౌడ సంక్షేమ సంఘం మండల గౌరవ అధ్యక్షులుగా, సొసైటీ అధ్యక్షులుగా, అందరితో అన్యోన్యంగా ఉండే  మంచి మిత్రుడు , నిత్యం గౌడన్నల అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిని కోల్పోయానన్నారు. నేడు మా అందరి నుండి భౌతికంగా విడిపోయిన మా హృదయంలో ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

మునుపటి వ్యాసం