రోడ్డుప్రమాదంలో గీత కార్మికుడు మృతి

రాంపూర్-స్టేషన్ పెండ్యాల ప్రధాన రహదారి పై ఘటన

వరంగల్, కాజీపేట(మే 29, 2021): వృత్తి పనిలో భాగంగా తాళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన శనివారం స్టేషన్ పెండ్యాల వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం...గడ్డం వెంకన్న(65) అనే గీతా కార్మికుడు తన వృత్తిలో భాగంగా కల్లును గీసి తిరిగి తన నివాసానికి వెళుతున్న క్రమంలో రాంపూర్-స్టేషన్ పెండ్యాల ప్రధాన రహదారి వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కేఏ 04 ఎంహెచ్ 5972 నంబరు గల వాహనం అతడిని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలై గడ్డం వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు.

మునుపటి వ్యాసం