‘ఛత్రపతి’ కోసం రూ. 3 కోట్లతో వేసిన సెట్ వర్షార్పణం

టైటిల్‌, ఇతర వివరాలు త్వరలో

హైదరాబాద్: ‘ఛత్రపతి’ కోసం రూ. 3 కోట్లతో వేసిన సెట్ పూర్తిగా దెబ్బతిన్నట్లు కళాదర్శకుడు సునీల్‌బాబు వెల్లడించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా వీ.వీ. వినాయక్‌ దర్శకత్వంలో ‘ఛత్రపతి’ని జయంతిలాల్‌ గడ హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కళాదర్శకుడు సునీల్‌బాబు నేతృత్వంలో హైదరాబాద్‌లో ఓ సెట్‌ వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ సెట్‌ తీవ్రంగా దెబ్బతిన్నదని నిర్మాత తెలిపారు. ‘‘ఆరు ఎకరాల్లో రూ. మూడు కోట్ల వ్యయంతో ఓ గ్రామాన్నిసెట్‌ వేశాం. ఏప్రిల్‌ 22న చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నాం. కానీ, కరోనా సెకండ్‌ వేవ్‌, లాక్‌డౌన్‌ వల్ల కుదరలేదు. వర్షాలకు తీవ్రంగా సెట్‌ దెబ్బతినడంతో పునరుద్దరిస్తున్నట్లు సునీల్‌బాబు తెలిపారు. టైటిల్‌, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

మునుపటి వ్యాసం