కరివేపాకు పచ్చడి ఇలా చేసి చూడండి

కావాల్సిన పదార్థలు, తయారీ విధానం

కావలసినవి: కరివేపాకు కట్టలు - ఐదు (చిన్నవి), ఎండుమిర్చి - పది, చింతపండు - నిమ్మకాయంత, పసుప్పు - అర టీస్పూన్‌, ధనియాలు అర టీస్పూన్‌, నువ్వులు - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - రెండు చిటికెడులు, నూనె - రెండు టీస్పూన్లు, శనగపప్పు - అర స్పూన్‌, మినప్పప్పు - అర స్పూన్‌, ఆవాలు - అర స్పూన్‌, జీలకర్ర - అర స్పూన్‌. 

తయారీ విధానం: ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి. నువ్వుపప్పు దోరగా వేయించాలి. స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక  ధనియాలు, జీలకర్ర, ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.  ఆ పోపును ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో ఎండుమిర్చి వేసి వేగించాలి. కాసేపయ్యాక కరివేపాకు వేయాలి. చింతపండు వేసి స్టవ్‌పై నుంచి దింపాలి. చల్లారాక అన్నీ కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. చివరగా కొద్దిగా నీళ్లు కలిపితే పచ్చడి తయారైనట్లే... వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రుచిగా ఉంటుంది.

మునుపటి వ్యాసం