ఆల్​టైం ఫేవరెట్ వెబ్ సిరీస్​లలో "స్కామ్ 1992"కు మొదటి స్థానం

మొత్తం 163 సిరీస్​లు పోటీపడగా భారత్ నుంచి ఈ సిరీస్ మాత్రమే లిస్ట్​లో నిలిచింది

న్యూదిల్లీ: హర్షద్ మెహతా బయోపిక్​గా తెరకెక్కిన 'స్కామ్ 1992' కు అరుదైన గౌరవం దక్కింది. ఈ వెబ్​ సిరీస్​ ఐఎండీబీ ఆల్​టైం ఫేవరెట్ వెబ్ సిరీస్​లలో మొదటి స్థానం సాధించుకుంది. మొత్తం 163 సిరీస్​లు పోటీపడగా భారత్ నుంచి కేవలం స్కామ్ 1992 మాత్రమే ఈ లిస్ట్​లో నిలిచింది. ఓట్ల లెక్కింపుతో స్కామ్ 1992కి అగ్రస్థానం దక్కింది. హన్షల్ మెహతా డైరెక్ట్​ చేసిన ‘స్కాం 1992: హర్షద్​ మెహతా స్టోరీ’ ప్రపంచంలో మోస్ట్​ వాచ్​డ్​ సిరీస్​గానూ గుర్తింపు దక్కించుకుంది. ఈ అరుదైన ఫీట్​పై సోనీ ఎల్​ఐవీ సిరీస్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. గుజరాతీ నటుడు ప్రతీక్​ గాంధీ లీడ్​ రోల్ చేసిన ఈ వెబ్ సిరీస్ రింగ్ టోన్​ ద్వారానూ పాపులర్ అయిన విషయం తెలిసిందే. 

మునుపటి వ్యాసం