'జగనన్న తోడు' రుణాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్

చిరువ్యాపారుల కోసం రూ.370 కోట్లు విడుదల

అమరావతి: చిరు వ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో రూపొందించిన 'జగనన్న తోడు' పథకంలో భాగంగా రెండో విడత రుణాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. రుణాల విడుదల అనంతరం ముఖ్యమంత్రి జగన్ మీడియాతో మాట్లాడారు. చిరువ్యాపారులు బ్యాంకు రుణాలు పుట్టక, బయట అధిక వడ్డీ రుణాలపై ఆధారపడి నష్టపోయే పరిస్థితులను చూశానన్నారు. ఈ పరిస్థితిని మార్చుతానని నాడు మాట ఇచ్చానని, నేడు హామీ నిలుపుకుంటూ 'జగనన్న తోడు' కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.

రాష్ట్రంలోని 3.7 లక్షల మంది చిరువ్యాపారుల కోసం రూ.370 కోట్లును ఆయన నేడు అందించారు. రూ.10 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో, రెండు దశల్లో కలిపి మొత్తం 9.05 లక్షల మందికి రూ.905 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందినట్లైంది. ఈ పథకంలో ఇచ్చే రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. 

మునుపటి వ్యాసం