హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు వ్యాక్సినేషన్ డ్రైవ్

నేటితో విజయవంతంగా ముగిసినట్లు మహేష్ సతీమణి నమ్రత ప్రకటన

గుంటూరు: సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన జన్మస్థలం, తాను దత్తత తీసుకున్న గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామంలో ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నేడు పూర్తి చేశారు.   మే 31 న ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో విజయవంతంగా ముగిసినట్లు మహేష్ సతీమణి నమ్రత ఘట్టమనేని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. గత వారం రోజుల నుంచి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాల్గొన్న ఆంధ్ర హాస్పిటల్స్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాని నమ్రత తెలిపారు. ఇప్పటికే ఎందరో వేలాది చిన్నారి గుండెలను కాపాడిన మహేష్, ఇప్పుడు సొంత ఊరిలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడం గొప్ప విషయమని పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట లో నటిస్తున్నాడు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలు పెట్టనున్నాడు.  

మునుపటి వ్యాసం