నిరుద్యోగులను నట్టేట ముంచారు: దాసరి శ్యామ్ చంద్ర

రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నట్టేట ముంచారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ చంద్ర శేషు విమర్శించారు.

పశ్చిమ గోదావరి: రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నట్టేట ముంచారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ చంద్ర శేషు విమర్శించారు. రెండేళ్లు దాటినా ఒక ఉద్యోగం ఇవ్వకుండా మాట తప్పారని ఆయన ఆరోపించారు. వారంలోనే సీపీఎస్ రద్దు అన్నారని, 700 రోజులు దాటినా ఆ ఊసే లేదని జగన్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు అంటే సీ క్యాపిటల్ రద్దు, పీ అంటే పోలవరం బ్రేక్, ఎస్ అంటే స్పెషల్ స్టేటస్ లేదు అని సీఎం కొత్త బాష్యం చెప్పారని శ్యామ్ చంద్ర శేషు విమర్శించారు.