ఏపీలో కొత్త‌గా 8,766 క‌రోనా కేసులు

కరోనాతో 67 మంది మృతి

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోసారి క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 8,766 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 67 మంది మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం ఏపీలో 1,03,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 17,76,878 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 16,61,187 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 11,696 మంది మ‌ర‌ణించారు.