సాయం కోసం గీత కార్మిక కుటుంబం ఎదురుచూపులు

తాటి చెట్టుపై నుంచి జారిపడి ఐసీయూలో కార్మికుడు

వరంగల్ అర్బన్: గీత వృత్తిని నమ్ముకుని కుటుంబ పోషణ చేస్తూ ఆనందంగా బ్రతికే ఓ కార్మిక కుటుంబాన్ని విధి వంచించింది. వారి సంతోషాన్ని ప్రమాదం రూపంలో దూరం చేసింది. జిల్లాలోని హసన్ పర్తి మండలం నాగారం గ్రామంలో జూన్ 6న బూర్న సదానందం గౌడ్ (55) గీత వృత్తి లో భాగంగా ఉదయం తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుండి జారి పడ్డాడు. దీంతో  సదానందం గౌడ్ కు తలకు, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఆయనను హన్మకొండలోని శ్రీనివాస పినాకిల్ ఆసుపత్రిలో చేర్పించారు. గత మూడు రోజుల నుంచి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బూర్న సదానందం గౌడ్ తలలో రక్తం గడ్డ కట్టిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు తమ వద్ద ఉన్న డబ్బుతో ఇప్పటి వరకు చికిత్స చేయించగలిగారు. నిరుపేద కుటుంబం కావటంతో ఆపరేషన్ కు కావాల్సిన మరో రూ. 6 లక్షల కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ఆస్తి పాస్తులు లేని గీత కార్మిక కుటుంబాన్ని తోటి గౌడన్నలు, ఇతర దాతలు ఆదుకోవాలని కుమార్తే బూర్న వర్షిని గౌడ్ వాపోతున్నారు. సాయం అందించేవారు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా తోచిన సాయం పంపాలని కోరారు. బూర్న వర్షిని గౌడ్ (9347647487 (Phone pe & Google pay)).

మునుపటి వ్యాసం