ఏపీలో కొత్తగా 8,110 పాజిటివ్ కేసులు నమోదు

కరోనా బారిన పడి 67 మంది ప్రాణాలు కోల్పోయారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 97,863 శాంపిల్స్‌ పరీక్షించగా 8,110 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో మరో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా నుంచి 12,981 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 99,057 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 11,763కు పెరిగింది. ఇప్పటి వరకు కొవిడ్‌ నుంచి 1677063 మంది కోలుకున్నారు.

మునుపటి వ్యాసం