రూ.13 కోట్ల విలువైన నకిలీ విత్తనాల పట్టివేత

వనస్థలిపురం కేంద్రంగా ద్వారాక సీడ్స్ అక్రమాలు

సూర్యాపేట: జిల్లాలో భారీగా నకిలీ మిరప  విత్తనాలను అధికారులు పట్టుకున్నారు . వనస్థలిపురం కేంద్రంగా ద్వారాక సీడ్స్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాల విలువ దాదాపు 13 కోట్ల 50 లక్షలు ఉంటుందన్నారు. మిర్చి, టమాట, పుచ్చకాయ, సోరకాయ, బీరకాయ విత్తనాల్లో పెద్ద ఎత్తున నకిలీ దందా కొనసాగుతున్నట్లు తెలిపారు. 5 రకాల కల్తీ విత్తనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం