యూపీఎస్సీ సివిల్స్ ఇంట‌ర్వ్యూ షెడ్యూల్ విడుద‌ల

ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగింపు

న్యూదిల్లీ: సివిల్ సర్వీసెస్ 2020 కోసం ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్‌సీ) విడుదల చేసింది. ఇంటర్వ్యూలు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహించనున్నారు. గతంలో ఈ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 26 నుంచి జరగాల్సి ఉండ‌గా, కొవిడ్-19 ఉద్ధృతి కారణంగా ఇవి వాయిదా పడ్డాయి. యూపీఎస్‌సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ లెటర్ త్వరలో జారీ చేయనున్నారు. ఇంటర్వ్యూలు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో జ‌రుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి, రెండవ సెషన్ మధ్యాహ్నం 1 నుంచి ప్రారంభమవుతాయి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ www.upsc.gov.in ద్వారా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను తనిఖీ చేసుకోవచ్చు. 

 

మునుపటి వ్యాసం