ఇప్పటివరకు 25 లక్షల 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు: పౌర సరఫరాల శాఖ

గతం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోళ్లు

అమరావతి: ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు, దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొంటున్నామని, ఈ క్రమంలో రైతుల పొలాలకు వెళ్లి ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని  ఇప్పటివరకు 25 లక్షల 25 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు చేయగా ఎప్పుడూ లేని విధంగా కడప, కర్నూల్‌లో అధికంగా కొనుగోళ్లు జరిపినట్లు ఆయన తెలిపారు. కేంద్రం నుంచి రూ.3,900 కోట్లు రావాల్సి ఉండగా, కేంద్రం ఏటా ఇచ్చే ముందస్తు మొత్తాన్ని  కూడా ఇవ్వలేదని అయినా పెండింగ్‌లో ఉన్న రూ.300 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. జులై నెలాఖరు వరకు ధాన్యం సేకరణ చేస్తామని అన్నారు.

మునుపటి వ్యాసం