మద్యం సేవించి వాహనం నడిపిన కానిస్టేబుల్ ...సస్పెండ్‌

ఉత్తర్వులు జారీ చేసిన నగర కమిషనర్

హైదరాబాద్‌: మద్యం సేవించి వాహనం నడిపిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌. రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన బహదూర్‌పురా కానిస్టేబుల్‌ కె.వెంకటేశ్‌ను ఆయన సస్పెండ్ ఆదేశాలు జారీ చేశారు. విధులకు హజరవుతున్న వెంకటేశ్‌ మద్యం సేవించి ఉండటంపై రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఓ కానిస్టేబుల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడి సస్పెండ్‌ అవ్వడంపై పోలీసు శాఖలో చర్చనీయాశమైంది.

మునుపటి వ్యాసం