జూలై 8న క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం: బొత్స సత్యనారాయణ

యూజర్ చార్జీపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం

అమరావతి: ఆస్తి విలువ ఆధారిత పన్ను నిర్ణయం ఎన్నికల ముందు నాటిదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూజర్ చార్జీపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. జూలై 8న క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని మంత్రి బొత్స ప్రకటించారు. వికేంద్రీకరణ బిల్లు పెట్టినప్పుడే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి లోబడే వికేంద్రీకరణ పక్రియ చేపట్టామని తెలిపారు. కొన్ని దుష్టశక్తులు రాజధాని తరలింపునకు అడ్డుపడుతున్నాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. 

 

మునుపటి వ్యాసం