హైదరాబాద్: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వింత జబ్బుతో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగీతం గ్రామానికి చెందిన ఓ చిన్నారి వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ జబ్బును నయం చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడుతుందని వైద్యులు చెప్పారు. అంత డబ్బు సర్దలేని ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఈ విషయాన్ని ఓ యువకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చాడు.
వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ పాపకు ఆపరేషన్ చేయిస్తానని.. వ్యాధి పూర్తిగా తగ్గే వరకు పూర్తి సహకారం అందిస్తానని భరోసానిచ్చారు. పాప అనారోగ్య సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అని కేటీఆర్ తెలిపారు . చెప్పిన విధంగానే వైద్యులు గురువారం పాపను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. దీంతో పాప కుటుంబ సభ్యులు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox