ఉచిత అన్నదాన తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

హమాల్ వాడి చౌరస్తాలో కరోనా బాధితులు, వారి సహాయకులకి భోజనం పంపిణీ

 నిజమాబాద్: దివంగత బిగాల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం కరోనా బాధితులకు ఉచితంగా అందిస్తున్న భోజన తయారీ కేంద్రాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల సందర్శించారు. అనంతరం హమాల్ వాడి చౌరస్తాలో కరోనా బాధితులు, వారి సహాయకులకి భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులు, వారి సహాయకులు, నిజామాబాద్ నగరంలో వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్న బాధితులకు భోజనం దొరకకుండా ఇబ్బంది పడకూడదని వారి కోసం మా తండ్రి జ్ఞాపకార్థం గత 35 రోజులుగా ఉచితంగా భోజనం వితరణ చేస్తున్నామని తెలిపారు. ఉచిత భోజన వితరణ కార్యక్రమంలో పాల్గొంటున్న కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్ ధన్యవాదాలు తెలిపారు.