ఈత – తాటి వ‌నాల‌ను ప‌రిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌

గీత కార్మికుల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి

జ‌గిత్యాల: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం జ‌గిత్యాల జిల్లాలో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మెట్‌ప‌ల్లి మండలం వెంపేట్ గ్రామంలోని ఈత – తాటి వనాలను స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో క‌లిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఈత వనాలలో పని చేస్తున్న గీత కార్మికులను కలసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు.