ఉన్నతాధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష

ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీ చేయాలని సూచన

హైదరాబాద్‌: ఉన్నతాధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆయా శాఖల్లో ఖాళీల వివరాలపై ఉన్నతాధికారులతో హరీష్‌రావు ఆరా తీశారు. రాష్ట్ర విభజన సమస్యలు, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో ఉన్న కార్యాలయాలు, ఆస్తులపై చర్చించారు.