హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

రాగల ఐదు రోజులు వర్ష సూచన

హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, యూసుఫ్‌గూడ, ఫిలింనగర్‌, అమీర్‌పేట, పంజాగుట్టలో వర్షం కురిసింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఈనెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 12, 13 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

మునుపటి వ్యాసం