జోరు మీదున్న ర‌షీద్ ఖాన్‌

పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో 5 వికెట్లు తీసిన ర‌షీద్

అబూదాబి: పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో ర‌షీద్ ఖాన్ అయిదు వికెట్లు తీసుకున్నాడు. లాహోర్ క్వ‌లాండ‌ర్స్ త‌ర‌పున ఆడుతున్న రషీద్ పెషావ‌ర్ జ‌ల్మీ బ్యాట్స్‌మెన్‌ను కుప్ప‌కూల్చాడు. గురువారం అబుదాబిలోని షేక్ జ‌యిద్ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన పీఎస్ఎల్ మ్యాచ్‌లో లాహోర్ జ‌ట్టు ప‌ది ప‌రుగుల తేడాతో పెషావ‌ర్ జ‌ల్మీపై విజ‌యం సాధించింది.

కీల‌క‌మైన రెండు పాయింట్లు సాధించిన‌ ఆ జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో ప‌ది పాయింట్ల‌తో మొదటి స్థానంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ క్వలాండ‌ర్స్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 170 పరుగులు చేసింది. ఆ జ‌ట్టులో టిమ్ డేవిడ్ 64, బెన్ డంక్ 46 ర‌న్స్ చేశారు. ఆ త‌ర్వాత 171 పరుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన పెషావ‌ర్‌కు ఆరంభం నుంచే స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. మేటి బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ ఆ జ‌ట్టును చావు దెబ్బ‌తీశాడు. కీల‌క‌మైన ద‌శ‌లో వికెట్ల‌ను తీసి పెషావ‌ర్‌ను అడ్డుకున్నాడు. ర‌షీద్ ఖాన్ 20 ప‌రుగులు ఇచ్చి కీల‌క‌మైన 5 వికెట్లు తీసుకున్నాడు.

మునుపటి వ్యాసం