లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి క‌త్తుల‌తో డ్యాన్స్

కేసు నమోదు చేసిన పోలీసులు

హైద‌రాబాద్: లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఓ ఇద్ద‌రు యువ‌కులు త‌మ‌ పుట్టిన రోజు వేడుకను జ‌రుపుకోవడంతో పాటు కత్తులతో డ్యాన్స్ చేసిన ఘటన న‌గ‌రంలోని హ‌బీబ్‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో బుధ‌వారం రాత్రి చోటు చేసుకుంది. స్నేహితులంతా క‌లిసి క‌త్తుల‌తో డ్యాన్స్ చేశారు. ఈ యువ‌కుల వీడియో సామాజిక మాధ్య‌మాల్లో శుక్ర‌వారం వెలుగులోకి వచ్చింది. పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్న సాయిరామ్, అర్జున్‌తో పాటు ఇత‌రుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

 

మునుపటి వ్యాసం