ప్రధాని మోదీతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి భేటీ

సుమారు గంట పాటు చర్చ


న్యూదిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో నాయకత్వ మార్పులు చేపట్టాలని కేంద్రం యోచిస్తోందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో భేటీ అయ్యారు. పార్టీలో యోగి పట్ల ఇతర నేతలు వ్యతిరేకత వ్యక్తం చేయడం తోపాటు కరోనా కట్టడిలో విఫలం కావడం లాంటి వాటిని పరిగణలోకి తీసుకుని  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వ మార్పులు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశం గంటకు పైగా సాగిందని సమాచారం. ఈ విషయాన్ని యోగి ట్విటర్‌ ద్వారా తెలిపారు. మోదీతో సమావేశమై ఆయన మార్గనిర్దేశకతను పొందే అవకాశం లభించిందని యోగీ అన్నారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్‌ భాజపా చీఫ్‌ జెపీ నడ్డా నివాసానికి వెళ్లారు. గురువారమే దిల్లీ పర్యటనకు వెళ్లిన యోగి ఆదిత్యానాథ్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. 

మునుపటి వ్యాసం