ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నేడు ఆసక్తికర మ్యాచ్

జకోవిచ్‌, రఫెల్‌ నాదల్‌ అమీతుమీ

హైదరాబాద్ : ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నేడు ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జకోవిచ్‌ క్లే కోర్టు రారాజు రఫెల్‌ నాదల్‌ లు శుక్రవారం సెమీఫైనల్‌ లో అమీతుమీ తేల్చుకోనున్నారు. గతేడాది వీరిద్దరు ఫైనల్‌లో తలపడగా నాదల్ విజేతగా నిలిచాడు. మ్యాచ్ పై జకోవిచ్ స్పందిస్తూ ఇది ఇతర మ్యాచ్‌లా కాదని, క్లే కోర్టులో నాదల్ తో ఆడడమంటే అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కోవడమేనన్నాడు. అతనికి అచ్చొచ్చిన ఈ గ్రాండ్‌ స్లామ్‌లో నాదల్‌ 7-1 తేడాతో జకో విచ్‌పై స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అయితే మొత్తంగా చూస్తే మాత్రం జొకోవిచ్‌ 29-28తో నాదల్‌ పై ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఈ సెమీస్‌కంటే ముందు సిట్సిపాస్‌- జ్వెరెవ్‌ల మధ్య పురుషుల తొలి సెమీఫైనల్‌ జరుగుతుంది.

 

మునుపటి వ్యాసం