నిర్మాతగా హృతిక్ రోషన్ !

మీడియం స్థాయి బడ్జెట్ సినిమాలను తీయనున్నట్లు సమాచారం

ముంబయి: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నిర్మాతగా మారాలనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. తన పేరిట ’హృతిక్ రోషన్ ఫిల్మ్స్’ బ్యానర్ స్థాపించి మీడియం స్థాయి బడ్జెట్ సినిమాలను తీయనున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ‘సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్’, అమీర్ ఖాన్ ‘అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్’, షారుఖ్ ఖాన్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’, అక్షయ్ కుమార్ ‘హరి ఓం ఎంటర్టైన్మెంట్స్’ అనే నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. వీరి బాటలోనే నిర్మాతగా సాగాలని హృతిక్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ‘వార్’ సినిమా అనంతరం హృతిక్  తన కొత్త ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించలేదు.

మునుపటి వ్యాసం