కరోనా పట్ల నిర్లక్ష్యం వహించొద్దు: కవిత

అర్హులైన ప్రతిఒక్కరు కరోనా టీకా వేయించుకోవాలని సూచన

నిజామాబాద్: కరోనా వైరస్ మహమ్మారి పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, అప్రమత్తంగా ఉండకపోతే, ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం పర్యటించిన ఆమె చౌర‌స్తాలోని పులాంగ్ పార్క్‌ను ఆమె సంద‌ర్శించారు. పార్కు నిర్మాణ ప‌నుల‌పై  అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కవిత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త అధ్వర్యంలో చేపట్టిన ఉచిత భోజ‌న వితరణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో భోజన వితరణ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. అర్హులైన ప్రతిఒక్కరు కరోనా టీకా వేయించుకోవాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆమె ప్రజలను కోరారు.