చమురు ధరలపై కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించట్లేదు?: జగ్గారెడ్డి

తెరాస, భాజపాల మధ్య అంతర్గత అవగాహన

సంగారెడ్డి: చమురు ధరల పెంపుదలపై కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించట్లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్లలో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, భాజపాల మధ్య అంతర్గత అవగాహన ఉందని జగ్గారెడ్డి ఆరోపించారు. 

 

మునుపటి వ్యాసం