నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ, నావెల్‌ అకాడెమీల్లో ప్రవేశాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

మొత్తం 400 ఖాళీలు కలవు.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ), నావెల్‌ అకాడెమీల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 400 ఖాళీలు కలవు.

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ): 370(ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్‌ఫోర్స్‌ 120)
నేవల్‌ అకాడెమీ(ఎన్‌ఏ): 30(10+2 కేడెట్‌ ఎంట్రీ స్కీమ్‌)

అర్హత: ఆర్మీ విభాగం పోస్టులకు ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ వింగ్స్‌ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్మీడియెట్‌ ఫైనల్‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
వ‌యసు: 2003 జనవరి 2 నుంచి 2006 జనవరి 1వ తేదీ మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వూ, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.06.2021
పరీక్ష తేది: 05.09.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in