ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్ (ప్రకాశం) ఖాళీలు

దరఖాస్తుకు జూన్ 25న చివరి తేదీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌.. ఒప్పందం ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈనోటిఫికేషన్ ప్రకారం మొత్తం 09 ఖాళీలు కలవు. వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి. దరఖాస్తుకు జూన్ 25న చివరి తేదీగా నిర్ణయించారు. 

అర్హత: మంచి అకడమిక్‌ రికార్డ్‌తో బీఎస్సీ(నర్సింగ్‌), ఎమ్మెస్సీ(నర్సింగ్‌), బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడి, బీఎస్సీ మెడికల్‌ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్, తెలుగు, ఇంగ్లీష్‌ చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వేతనం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం:విద్యార్హతలు,కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్, డా.వైఎస్సార్‌ ఏహెచ్‌సీటీ, ఆపోజిట్‌: ప్రకాశం భవన్, ఓల్డ్‌ రిమ్స్, ఓంగోలు చిరునామాకు పంపించాలి.

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in