ప్రమాదవశాత్తు మోకుజారి ప్రాణాలు వదిలిన గీత కార్మికుడు

గాలివానతో తాటి చెట్టు పై నుంచి జారిపడి మృతి

జయశంకర్ భూపాలపల్లి: ప్రమాదవశాత్తు మోకుజారి ప్రాణాలు వదిలిన గీత కార్మికుడి ఘటన జిల్లాలోని రేగొండ మండలం రంగయ్య పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బండి కొమురయ్య అనే వ్యక్తి వృత్తి పనిలో భాగంగా ఎప్పటిలానే కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. అదే సమయానికి గాలివన రావటంతో మోకుజారింది. దీంతో ఆయనకు తీవ్రగాయాలవగా అక్కడికక్కడే మృతి చెందాడు.     మృతుడికి భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాత్రి కురిసిన వర్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 

మునుపటి వ్యాసం